
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయిత నుండి దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్న వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య.. ఉపశీర్షిక నా ఇల్లు ఇండియా. సినిమాలో బన్ని ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలిసిందే. ఇక న్యూ ఇయర్ గిఫ్ట్ గా సినిమాకు సంబందించిన ఫస్ట్ ఇంప్యాక్ట్ అంటూ టీజర్ రిలీజ్ చేశారు. సినిమాలో ఎంత డెప్త్ ఉందో టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
ఇక మన స్టైలిష్ స్టార్ మరోసారి స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టినట్టు ఉన్నాడు. టీజర్ మొత్తం బన్ని సినిమాకు పడిన కష్టం తెలుస్తుంది. ఫైనల్ గా టీజర్ లో ఎండింగ్ లో ఇక్కడ కాదు గాడ్ ఫాదర్ బోర్డర్ కెళ్లి చచ్చిపోతా అని చెప్పిన అల్లు అర్జున్ డైలాగ్ సిని ప్రియులకు సౌండ్ లేకుండా చేసిందని చెప్పాలి. మెగా అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉన్న నా పేరు సూర్య టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాతో మరోసారి బన్ని హిట్ కొట్టడం ఖాయం అని తెలుస్తుంది.