
మెగా హీరోలకు సంబందించిన ఏ హీరో సినిమా వచ్చిన మెగా హీరోలను పొగడకుండా ఉండరు. వారికి సంబందించిన డైలాగ్స్ కూడా వారి సినిమాల్లో ఉంచుతారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక్కషణంలో పవర్ స్టార్ అజ్ఞాతవాసి డైలాగ్ వాడేసి మరోసారి పవన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నాడు అల్లు శిరీష్. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కోపం వచ్చేలా అల్లు అర్జున్ చేసిన చెప్పను బ్రదర్ కామెంట్స్ అల్లు హీరోలను మెగా ఫ్యాన్స్ నుండి దూరం చేశాయి.
అయితే నష్టనివారణ చర్యలు చేసినా దానికి తాలూఖా అసంతృప్తి ఛాయలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక అల్లు అరవింద్ కూడా ఈ మ్యాటర్ ను క్లోజ్ చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా అల్లు శిరీష్ సినిమాలో అజ్ఞాతవాసి డైలాగ్ వీడి చర్యలు ఊహాతీతం అన్న టీజర్ డైలాగ్ పెట్టి పవర్ స్టార్ పై తమ ప్రేమను చాటుకున్నారు. సినిమాలో అది కమెడియన్ చేత చెప్పించిన డైలాగ్ అయినా పవన్ సినిమా టీజర్ డైలాగ్ వాడటం పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.