అఖిల్ కన్ను అతని మీద పడిందట..!

అక్కినేని అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన సెకండ్ మూవీ హలో ఎట్టకేలకు హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున విక్రం పై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టింది. అయితే ఇక ఇప్పుడు అఖిల్ తన తర్వాత సినిమా మీద ఫోకస్ పెట్టాడు. అసలైతే సుకుమార్, కొరటాల శివ లాంటి దర్శకుల పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు కొత్తగా తమిళ క్రేజీ డైరక్టర్ అత్లీ డైరక్షన్ లో అఖిల్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. 

రాజా రాణి సినిమా తర్వాత విజయ్ తేరి తెలుగులో పోలీస్ తో దర్శకుడిగా తన సత్తా చాటిన అత్లీ ఆ తర్వాత విజయ్ తో మెర్సల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అత్లీ సినిమాలకు తెలుగులో కూడా బాగానే క్రేజ్ ఏర్పడింది. మెర్సల్ తెలుగు వర్షన్ అదిరింది ఇక్కడ ప్రేక్షకులను అలరించింది. అందుకే అఖిల్ అత్లీ మీద దృష్టి పెట్టాడట. 

తెలుగు దర్శకులను కాదని అఖిల్ తన 3వ సినిమా తమిళ దర్శకుడి మీద డిపెండ్ అవడం కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా.. అఖిల్ కెరియర్ పై నాగార్జున చేస్తున్న ప్లాన్ అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.