నల్గొండ లో క్యాన్సర్ పై అవగాహన కల్పించనున్న డీఎన్ఎఫ్

డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ (డీఎన్ఎఫ్) వారు, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఛాతీ పరీక్షలు, సెర్వికల్ పప్ స్మియర్, మామోగ్రాఫి, కీమోథెరపీ, అల్ట్రా సొనోగ్రఫీ వంటి పలు రకాలైన పరీక్షలు నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒక్కరు, ఏదో ఒక క్యాన్సర్ కి సంబంధించిన వ్యాధితో బాధ పడుతుండడం వల్ల, డీఎన్ఎఫ్ మొదటి క్యాంప్ ఇదే జిల్లాలోని మిర్యాలగూడ లో జరుగుతుంది.   

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎన్నారైలు ఈ కార్యక్రమం మెచ్చి, విరాళాలు అందించడం విశేషం. కేవలం 24 గంటల్లో $1550 విరాళాలు అందుకున్న ఈ క్యాంపు, మరికొన్ని రోజుల్లో మరింత ఎక్కువ విరాళాలు సేకరింఛి విజయవంతమవనుంది.  

వేదిక:  రైస్ మిల్లర్ అసోసియేషన్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ