గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు మరి కొంత మంది, కాంగ్రెస్ పార్టీని వీడి రేపు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. దీన్ని జానా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.
అంతర్గత కలహాల వల్ల పార్టీని వీడుతున్నానని గుత్తా చెప్పడం హాస్యాస్పదం అని, టీడీపీ లో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని కోమటి రెడ్డి మీడియా సాక్షిగా గుత్తాని ప్రశ్నించారు. పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికయ్యే దమ్ముందా అని ఛాలెంజ్ కూడా విసిరారు
మరో వైపు జానా రెడ్డి మాట్లాడుతూ, ఉన్న పదవులకు రాజీనామా చేసి పార్టీని వీడవలసిందిగా డిమాండ్ చేశారు. ఇలాంటి ఫిరాయింపు పనులు చేస్తున్న టీఆర్ఎస్ బంగారు తెలంగాణ ఎలా తీసుకొస్తుంది అని ప్రశ్నించారు. తన సీఎల్పీ పదవికి రాజీనామా చేస్తానని మీడియా ముందు చెప్పినా కూడా, రేపు దిగ్విజయ్ సింగ్ తెలంగాణకి రానుండడంతో ఆ నిర్ణయం ముందుకు సాగుతుందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.