సంబంధిత వార్తలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అండ ఉందని టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని, కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం కట్టాలనుకుంటున్న పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడుతుందని అభిప్రాయ పడ్డారు. ఎప్పుడూ సంయమనంతో ఉండే తుమ్మల, ఇలా ఒకేసారి విరుచుకుపడడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూడా ఇవాళ తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.