సంబంధిత వార్తలు
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా రైతులు నిరసన చేపడుతున్నారు. నీటిపారుదల మరియు పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గజ్వేల్ లోని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో, కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రభుత్వం మరో 15000 ఎకరాలు సేకరించే ఆలోచనలో ఉంది. అక్కడితో సరిపోకుండా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (NIMZ) కోసం మరో 25000 ఎకరాలు మెదక్ జిల్లా కోల్పోబోతోంది. జహీరాబాద్ లోని 31 ఊర్లు ఇందులో కొట్టుకుపోతాయని అంచనా.