సంబంధిత వార్తలు
తెలంగాణ రాష్ట్రం సాధించిన రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఇప్పుడు 'తెలంగాణ టుడే' పేరుతో ఒక ఆంగ్ల దిన పత్రిక ప్రారంభించనుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, 'తెలంగాణ పబ్లికేషన్స్' అనే కంపనీ లో రూ 4 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఆ కంపనీ స్థాపించిన పత్రికే 'నమస్తే తెలంగాణ'. ఆ తర్వాత, 'తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్' అనే కంపనీ ప్రారంభించిన 'టీ-న్యూస్' లో కూడా ముఖ్యమంత్రికి వాటా ఉంది. గతంలో 'ది హిందూ' మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి 'తెలంగాణ టుడే' పత్రిక కు ఎడిటర్ గా వ్యవహరిస్తారు.