హైదరాబాద్ కు సేల్స్ ఫోర్సు

గూగుల్, యాపిల్ తర్వాత మరో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపనీ సేల్స్ ఫోర్సు తమ కొత్త బ్రాంచ్ హైదరాబాద్ లో నెల కొల్పడానికి నిర్ణయించుకుంది.
ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్న ఐటీ మంత్రి కెటీఆర్, సేల్స్ ఫోర్సు వీఐపీ లతో సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించగా, అవి నచ్చి అదే సమావేశంలో, తెలంగాణ లో ఒక బ్రాంచ్ నెల కోల్పాలని సేల్స్ ఫోర్సు నిర్ణయించుకోవడం అభినందనీయం. ఈ కొత్త కంపనీ వెయ్యి మందికి ఉపాధి కలిపించనుందని సమాచారం.