తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత అందుకు కృతజ్ఞతగా టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ లో కలాపాలనుకున్నారు కెసీఆర్. అయితే రాష్ట్రం ప్రకటించినందుకు, ప్రజలందరూ తమ వైపే ఉంటారనే నమ్మకంతో, కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ తో చేతులు కలపడానికి వెనకడుగేసింది. ఆ తర్వాత, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వేసిన ప్రతి అడుగూ ఒక సంచలనమే. మొదట్లో నాలుగు జిల్లాల్లో మాత్రమే సంస్థాగత బలం ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడు మొత్తం పది జిల్లాల్లో ఆ బలం సంపాదించగలిగింది.
రాష్ట్రం లో మిగతా పార్టీల స్థానం ఇక కనుమరుగైట్లే అన్న మాటని నిజం చేస్తూ, అన్ని పార్టీల లోని నాయకులు, టీఆర్ఎస్ పార్టీలోనే చేరుతూ, మిగతా పార్టీలని ఖాళీ చేసే పనిలో పడ్డారు. 63 ఎమ్మెల్యేలు ఉండాల్సిన టీఆర్ఎస్ పార్టీలో, ప్రస్తుతానికి 88 మంది ఉండడం ఆశ్చర్యకరం. ఒకటి రెండు సార్లు ప్రత్యర్థి పార్టీలు టీఆర్ఎస్ పార్టీ పై యుద్ధం ప్రకటించాలని చూసినా, ఆ ప్రయోగాలన్నీ చేదు అనుభవాలుగానే మిగిలాయి. వరంగల్ లోక్ సభ ఎన్నికల దగ్గరినుండి మొన్నటి పాలేరు ఎన్నికల వరకు అన్నింటిలో టీఆర్ఎస్ తన విజయ దుందుభి మొగిస్తునే ఉంది. రాష్ట్రాలు విడిపోతే కరెంట్ కష్టాలు తెలంగాణకి తప్పవని, అప్పటి ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి భారీ స్కెచ్ లు గీసి చెప్పినా, తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల్లోనే, 24 గంటల విద్యుత్తు సాధించగలిగిన ఘనత, కెసిఆర్ సొంతం.
ఈ విజయ దుందుభి మోగిస్తూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈ కింది విధంగా జరగనున్నాయి.
- కెసిఆర్ ఉదయం 9.45 నిమిషాలకు గన్ పార్క్ లో తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
- అటునుండి లుంబిని పార్క్ దగ్గరిలోని 12 ఎకరాల సైట్ కి విచ్చేసి తెలంగాణ అమర వీరుల స్థూపాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
- 10.15 నిముషాలకు సంజీవయ్య పార్క్ లో అతిపెద్ద జాతీయ జెండా ఎగురవేస్తారు.
- 10.30 నిముషాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కెసిఆర్ పాల్గొంటారు.
- 12.00 గంటలకు మాదాపూర్ హెచ్ఐసిసి లో ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కెసిఆర్ తో పాటు, గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొంటారు.
'తెలంగాణ సాంస్క్రతిక సారధి' నుండి కళాకారులు 'తెలంగాణ సాంస్కృతిక జైత్ర యాత్ర'లో పాల్గొంటారు. రోజుకి రెండు జిల్లాలు చొప్పున రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో ప్రదర్శనలు ఇస్తారు ఈ రోజు నెక్లెస్ రోడ్ లో, వీరి మొదటి ప్రదర్శన ఉంటుంది.