హిమాలయాల్లో నోర్బు పర్వతం పై తెలంగాణ జెండా


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హిమాలయాల్లోని నోర్బు పర్వతంపై జాతీయ పతాకంతోపాటు తెలంగాణ జెండా రెపరెపలాడనుంది. వేడుకల్లో పాల్గొనడానికి, రాష్ట్ర  అడ్వెంచర్ క్లబ్ అధ్యక్షుడు కే రంగారావు నేతృత్వంలో ఎనిమిది మంది బృందంగా ఏర్పడి, బుధవారం సాయంత్రం తమ లక్ష్యానికి 600 అడుగుల దూరానికి చేరుకున్నారు. 5226 మీటర్ల ఎత్తులో ఉన్న నోర్బు పర్వతం పై జెండా ఎగరవేసిన తర్వాత, ఈ బృందం అక్కడే బతుకమ్మ ఆడనుంది.   


ఈ బృందంలో  టీ నితిన్ రావు (న్యూహౌసింగ్‌బోర్డు కాలనీ, నిజామాబాద్), ఏ సత్యనారాయణ (తిరుమలగిరి, నల్లగొండ), రాజశేఖర్ నాయక్ (తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్‌పల్లి), సుధీర్‌సింగ్ (ధూల్‌పేట, హైదరాబాద్), ప్రవీణ్‌కుమార్ (నారాయణ్‌ఖేడ్, మెదక్),  ఎం విశాల్‌శర్మ (నిజామాబాద్), ఏ తుకారాం (తక్కెళ్ళపల్లి, రంగారెడ్డి) ఉన్నారు.