టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత, ఆ స్థాయిలో జనాకర్షణ కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది హరీష్ రావు మాత్రమే. కెసిఆర్ తర్వాత పెద్ద కుర్చీపై కూర్చునే సత్తా ఉన్న నాయకుడు ఆయనే అని అంతా అనుకున్నారు.
అయితే టీఆర్ఎస్, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక కెసిఆర్, తన కుమారుడు కెటీఆర్ ను, పార్టీ వారసుడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదనలు వినిపించాయి. కాని కుమారుడితో పోలిస్తే, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవితకి ఎక్కువ జనాకర్షణ ఉందని తనే పెద్ద కుర్చీ కి తగిన న్యాయం చేయగలదని అంతా అనుకోవడంతో, కథ కొత్త మలుపు తిరిగింది. ఈ గంధరగోళంలో ఇప్పుడు నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు, పార్టీ వారసుడెవరనే ప్రశ్నకి సమాధానం ఇచ్చారు.
జనాలకు పార్టీ పై అపారమైన నమ్మకం ఉండడంతో, కనీసం మరో ఇరవై ఏళ్ల దాకైనా కెసిఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కాబట్టి ఇప్పట్లో వారుసుడెవరనే ప్రశ్నకు సమాధానం దొరకదని స్పష్టం చేశారు. పార్టీలో నంబర్ గేమ్ లేదని, తన మనుషులకు పదవులు రావడం లేదనే వాదన సరికాదని, ఉద్యమం సమయంలో కన్నా ఇప్పుడే కుటుంబాన్ని ఎక్కువ మిస్ అవుతున్నామని, హరీష్ రావు తెలిపారు.