తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం రూ1.8 కోట్లు విలువైన జెండా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న జాతీయ జెండా విలువ, అక్షరాలా రూ1.8 కోట్లు. జెండా విలువ బయటికి వచ్చాక, అది రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది.

మరో వైపు విశ్లేషకులు, ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ, అంత పెద్ద జెండా విమానాల ప్రయాణాలకు అడ్డంకి కావొచ్చనే ఉద్దేశంతో, ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (AAI) అడ్డు తగులొచ్చు అని అభిప్రాయపడ్డారు. కాని జెండా ఆలోచన వచ్చినప్పుడే, ప్రభుత్వం AAI తో చర్చలు జరిపిందని, వాళ్ళు అనుమతి ఇచ్చినప్పుడే ముందు కెళ్ళిందని తెలుస్తోంది.

అదే నిజమైతే, పాలిస్టర్ తో చేయబడిన 303 ఫీట్ల జాతీయ జెండా జూన్ 2న, సంజీవయ్య పార్క్ లో రెపరెపలాడక తప్పదు.