సమైఖ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత, ఆ స్థాయిలో రాజకీయంగా పేరు గడించిన వ్యక్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుంటారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన తర్వాత, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా అద్వితీయ మెజారిటీతో గెలిచారు. అక్కడితో పనైపోయిందని అనుకోకుండా పేదలకు రెండు పడకల గదులు, 24 గంటల విద్యుత్తు, నీటి ప్రాజెక్టులు అంటూ రకరకాల పధకాలతో, ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలను సైతం నోరు మెదపనివ్వకుండా చేశారు.
ఇప్పుడు మరోసారి తన ఉనికిని చాటుకుంటూ, హైదరాబాద్ లోని ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్తది నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనను కార్యరూపం దాల్చబోతున్నట్లు చెబుతూ, కొత్త సచివాలయం ఊహా చిత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. చెప్పి మరీ చేయబోతున్న ఈ ముఖ్యమంత్రి తీరు, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది.