గతంలో నవలలు పలు రచనలు చేసిన అలికట్టె శంకర్ ఇప్పుడు తెలంగాణ ఎన్సైక్లోపెడియా సిద్ధం చేయడానికి పూనుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలోనే ఈ ఆలోచన చేసిన శంకర్, అప్పటి నుండి వివారాలు సేకరిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే సగానికి పైగా పూర్తైన ఎన్సైక్లోపెడియా, వచ్చే సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం కల్లా పూర్తవుతుందని, అదే రోజు విడుదల చేస్తామని శంకర్ అన్నారు. గతంలో చాకల్ ఐలమ్మ జీవిత చరిత్ర రాసిన అనుభవం శంకర్ సొంతం. జల సాధన కమిటీ ఏర్పాటు చేసి నీటి ప్రాజెక్టులు కోసం ఉద్యమించిన దుశ్శరాల సత్యనారాయణ గారి ఆటోబయోగ్రఫీకి ఎడిటర్ గా కూడా శంకర్ పని చేశారు. ఇప్పటికి 600 పేజిలకు సరిపడా వివరాలు సేకరించిన శంకర్, మరో 400 పేజిలకు సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉంది.
ఈ ఎన్సైక్లోపీడియాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు, సాహిత్య వ్యక్తిత్వాలను, పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ వ్యక్తులు మరియు అనేక ఇతర విషయాల గురించి ప్రస్థావించడమైనది.
రాష్ట్రం లోని, ప్రముఖ సంఘటనలతో పాటు, ఎన్సైక్లోపీడియాలో 500 పైగా కవులు మరియు 500 రచయితలు, మరియు 600 ఇతర ప్రముఖ వ్యక్తుల కథనాలు కూడా ఉంటాయి.