తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకోవడానికి, ప్రభుత్వం రాష్ట్రం లోని ప్రతి జిల్లాకు ముప్పై లక్షలు కేటాయించింది.
ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ, నిధులు విడుదల చేయనుంది. పురపాలక శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ కూడా సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని కార్పొరేషన్ ఆఫీసుల్లో, మున్సిపాల్టీలలో, నగర పంచాయతీ కార్యాలయాల్లో, జాతీయ జెండాను ఎగుర వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సంబురాల్లో భాగంగా, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పధకం గురించి అధికారులు వివరిస్తారు. అవతరణ దినోత్సవం కోసం పనిచేసిన వారందరికీ, స్వీట్లు పంచి పెట్టాలని, ఈ మేరకు మండలాభివృద్ధి అధికారుల అకౌంట్‌కు ఒక్కొక్క కూలీకి రూ.10 చొప్పున నిధులు విడుదల చేసినట్లు అధికారాలు తెలిపారు.