మహానాడు లో రేవురి ప్రకాష్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి మరియు కాంగ్రెస్ చీఫ్ రఘువీరరెడ్డి అనుమతి తీసుకోవాలని రేవూరి అన్నారు. ఆ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన హరీష్, "అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేయడానికి రేవూరి కి కొంచమైనా సిగ్గు శరం ఉండాలి. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడానికి రాష్ట ప్రజల అనుమంతి ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం కూడా రేవూరి కి తెలియకపోవడం ఆయన అమాయకత్వానికి నిదర్శనం" అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ప్రాజెక్టులు పూర్తయితే,
టీడీపీ, కాంగ్రెస్ లకు రాష్ట్రం లో పుట్టగతులు ఉండవనే భయంతో ఇలా లేని
పోనివి మాట్లాడి రాష్ట్రాభివృద్ధి ఆపాలని చూస్తున్నారని హరీష్ రావు
అన్నారు. హరీష్ మాటని గుర్తు చేస్తూ, ప్రాజెక్టులు పూర్తైన మరుక్షణం
టీఆర్ఎస్ కు మరింత బలం చేకూరడం, ఆ దెబ్బతో ప్రతిపక్ష పార్టీలన్నీ
తుడిచిపెట్టుకుపోవడం తప్పదు అని విశ్లేషకులు అంటున్నారు.