తెలంగాణా ట్రాన్స్ కో సంస్థ తమకు బాకీ ఉన్న రూ.3,188 కోట్లు తక్షణమే చెల్లించకపోతే తెలంగాణాకు సరఫరా చేస్తున్న 400 మెగావాట్స్ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఏపి జెన్ కో సంస్థ వ్రాసిన లేఖకు తెలంగాణా జెన్ కో కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. ఏపి నుంచి తమకు రూ.1676.46 కోట్లు రావలసి ఉందని, ఆ విషయం గురించి ప్రస్తావించకుండా బకాయిల గురించి లేఖలు వ్రాయడం, లేకపోతే విద్యుత్ సరఫరా నిలివేస్తామని బెదిరించడం సరికాదని ఘాటుగా బదులిచ్చింది. ఒకవేళ ఏపి జెన్ కో తమకు చెల్లించవలసిన ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించకపోతే తాము కూడా ఏపికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆ లేఖలో హెచ్చరించింది. కర్నూలు, అనంతపురం జిల్లాలకు విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లించాలని లేఖలో తెలంగాణా జెన్ కో కోరింది.