డీఎస్, కెప్టెన్ టీఆర్ఎస్ నుండి రాజ్యసభకు

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డి శ్రీనివాస్, మాజీ మంత్రి కెప్టెన్. వి లక్ష్మీకాంతరావు (రిటైర్డ్), రాష్ట్రం నుండి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ కు అర్హులైన వారి లిస్టు తయారు చేసి, అందులోనుండి వీరిద్దరూ రాజ్యసభలో తగిన న్యాయం చేయగలరు అని సీనియర్ నాయుకులతో కలిసి చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

2015 లో, పెద్ద డ్రామా నడుమ డి శ్రీనివాస్ కాంగ్రెస్ ని విడిచి టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ లో దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన డీఎస్, టీఆర్ఎస్ లో చేరడం, ముఖ్యమంత్రి కెసిఆర్ ను సంతోష పరిచింది. 

ఇక కెప్టెన్. రావు (రిటైర్డ్), వై ఎస్ రాజశేకర్ రెడ్డి గారి హయాంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఉన్నారు. మాజీ ప్రధాని కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి దగ్గరి బంధువైన కెప్టెన్, కాంగ్రెస్ మాజీ ఎంపి దివంగత వొడితెల రాజేశ్వరరావు గారికి తమ్ముడు కూడా.  

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. టీఆర్ఎస్ నుండి ఇద్దరు బరిలోకి దిగుతున్నారు కాబట్టి, ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.