కెసిఆర్ ఆరోజు నిర్ణయం ఈరోజు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నెలల్లోనే, ప్రభుత్వ ప్రయోజనాలు మరెవరికి    వృధా కాకుండా, అర్హులైన వారికి మాత్రమే అందాలనే సంకల్పంతో, ఇంటింటి సర్వే నిర్వహించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఎంతో మంది, ఇది కాదు, ఇది అవదు అని అంటున్న సమయంలోనే, అందరిని ముక్కున వేలేస్కునేలా ఆగష్టు 19న, ఒకే రోజులో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, ఒక కోటి తొమ్మిది వేల కుటుంబాల ఇంటికి వెళ్లి సర్వే చేయడం జరిగింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాకుండా ఇంకెవరైనా సరే, ఇంత పెద్ద ధైర్యం చేసే వారు కాదని, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతారు. బహుశా ఆ నమ్మకమేనేమో, ఇప్పుడు ఇంటింటి సర్వే నిర్వహణ ప్రతిష్టాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కేలా చేసింది.