ఇటీవల పాలేరులో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, తన ప్రతిభ చాటుకున్న తుమ్మల నాగేశ్వరరావుని హోం మినిస్టర్ కుర్చీలో కుర్చోబెట్టాలనే ఆలోచనలో, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు విజయమే కాక తుమ్మల నే హోం మినిస్టర్ గా ఎంచుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గర మరికొన్ని వ్యూహాలు కూడా ఉన్నాయి.
టిఆర్ఎస్ మంత్రికి కమ్మ కుల ప్రజలలో మంచి పాపులారిటీ తో పాటు, ఆంద్ర రాష్ట్ర పారిశ్రామిక వేత్తలతో, సినీ పెద్దలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు రాజకీయాల్లో ఆరితేరిన రాజకీయ నాయకుడు తుమ్మల. దీనికి తోడు ఖమ్మం లో ఏమాత్రం పట్టు లేని టీఆర్ఎస్ పార్టీకి, ఆ జిల్లాలో బాగా పాపులారిటీ ఉన్న తుమ్మలను తెచ్చి హోం మంత్రిని చేస్తే పార్టీ కి బాగా కలిసి వస్తుందని, ఇలా అన్ని రకాల ఎత్తుగడలు ఆలోచించి, తుమ్మలనే పెద్ద కుర్చీ ఎక్కించాలని ముఖ్యమంత్రి తో పాటు పార్టీ సీనియర్ నాయకులు కూడా అభిప్రాయపడ్డారని సమాచారం.
ఇక పార్టీకి చాలా కాలం నుండి తన సేవలు అందించిన నాయిని నరసింహా రెడ్డిని పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టి ఆయన స్థానంలో తుమ్మలను తీసుకుంటారని, ఈ మేరకు ప్రకటన తొందరలోనే రావొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు.