వేడుకలే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నుండి, పరిపాలనా విధానంలో కూడా రాష్ట్రం లో ఎన్నో మార్పులు కనబడనున్నాయి. అందుకు సాక్ష్యమే ఈ 'నో హెల్మెట్ నో పెట్రోల్' రూల్.
ఆదిలాబాద్ జిల్లా ఆర్టి ఏ అధికారులు, 'నో హెల్మెట్ నో పెట్రోల్' రూల్ ను జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులు పంపించి జూన్ 2 నుండి అమలు చేయవలసిందిగా ఆర్డర్ జారీ చేశారు. దేశంలోని చాలా నగరాల్లో ఈ రూల్ ఇప్పటికే అమలులో ఉంది. 75% మంది ఈ రూల్ ని పాటిస్తూ హెల్మెట్లు ధరిస్తున్నారు. అందుకని తెలంగాణ రాష్ట్రం లో కూడా, ముందుగా ఆదిలాబాద్ లో మొదలుపెట్టాక విజయం సాధిస్తే, మెల్లిగా రాష్ట్రం మొత్తం మీద అమలు చేయాలని యోచనలో అధికారులు ఉన్నారు.