మూడురోజుల పర్యటనకై చికాగో వెళ్ళిన ఐటీ మంత్రి కెటీఆర్, తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి అనేక ఊహాగానాలకు తెరలేపారు. ఎన్ఆర్ఐల ఘన స్వాగతం తరువాత, సమావేశంలో పాల్గొన్నమంత్రి, చికాగోకి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి మంచి అనుబంధం ఉందని, ఆ బంధాన్ని పెంచుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ఆర్ఐ లు ముందు రావాలని కెటీఆర్ తన ఆశాభావం వ్యక్తం చేశారు.
సమావేశం అనంతరం కొన్ని పెద్ద కంపనీలతో భేటి ఐన కెటీఆర్, డిజిటల్ హెల్త్ కేర్ కంపనీ తో 15 మిలియన్ డాలర్ల ఒప్పందానికి వచ్చారు. దానికి తోడుగా, ఇల్లినాయిస్ డిప్యూటీ గవర్నర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరచినట్లు సమాచారం.