తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, మరియు బీసీ సంక్షేమ సంఘం చీఫ్, ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో, కొంత మంది బీసీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పై యుద్ధం ప్రకటించనున్నారు.
గంటా శ్రీనివాస రావు, చినరాజప్ప, నారాయణ మొదలగు కాపు నేతలు ముఖ్యమంత్రి దగ్గర తమ కోర్కెలు ప్రస్తావించి తీర్చుకుంటున్నారని, దాని వల్ల బీసీలకు రోజురోజుకీ అన్యాయం జరుగుతుందని సదరు బీసీ నేతలు ఆరోపించారు. రవీంద్ర, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, లాంటి నాయకులు బీసీకి చెందినా, వారు నోరు మెదపక పోవడం బాధాకరం అని అంటూ కృష్ణయ్య గారిని ముందు రావాల్సిందిగా అభ్యర్ధించారు. అడిగిన వెంటనే బీసీ నేతల వెనక తాను ఉంటాను కృష్ణయ్య గారు భరోసా ఇవ్వడం అందరిని సంతోషపరిచింది.
ఇప్పటికే తెలంగాణ లో టీడీపీ పార్టీ తుడిచి పెట్టుకుపోతున్న తరుణంలో, ఇలాంటి పరిస్థితి మరింత గందరగోళం సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.