రాజ్యసభ రెండు సీట్ల భర్తీకి టీఆర్ఎస్ యత్నాలు

జూన్ 11న ఖాళీగా ఉన్న  సీట్లకు ఎన్నికలు ఉండవచ్చని ఉన్నతవర్గాల సమాచారం.

సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, మాజీ మంత్రి కెప్టెన్. వి లక్ష్మికాంత రావు గారితో ఒక సీటును భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక రాజ్య సభ సీటును బీజేపీ అభ్యర్ధికి కేటాయించమని కోరారని,  టీఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకుల్లో ఒకరు చెప్పారు. "మోడీ గారు, ముఖ్యమంత్రిని రాజ్య సభ సీట్  కోసం అభ్యర్ధించిన విషయం నిజం, కాని కెసిఆర్ గారు ఈ మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాజ్య సభలోని రెండు సీట్ లను టీఆర్ఎస్ పార్టీ నాయకులతోనే భర్తీ చేయాలని యోచిస్తున్నారు" అని సదరు సీనియర్ నాయకులు తెలిపారు.          

నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రచురణకర్త డి దామోదర్ రావు, టీఎన్జీవో నాయకుడు దేవీ ప్రసాద్, ప్రభుత్వ సలహాదారు డి శ్రీనివాస్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, డా. ఎస్ వేణుగోపాల చారి లాంటి వారు కూడా పరిశీలనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు, రాజ్యసభ కు వెళ్ళే ఆ ఇద్దరి పేర్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించనున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.