ఎన్నికలు లేవు, కాబట్టి తెలంగాణ లో పెంపులు షురూ!

జూన్ 2 వ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీస్కోనున్నట్లుగా తెలుస్తోంది.  
పవర్ టారిఫ్, ఆర్టీసీ ఛార్జీల పెంపు, ఆస్తి పన్ను పెంపు వంటి ఎన్నో వాటి మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల మూలంగా అటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది. అయితే మొన్నముగిసిన పాలేరు ఎన్నికల తర్వాత ఇక దగ్గరలో వేరే ఎన్నికలు లేకపోవడం వల్ల, జూన్ నుండి ఆగస్ట్ నెలలో కీలక నిర్నయాలు తీసుకోనుంది.   

జిహెచ్ఎంసి మినహా, మిగిలిన ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఆస్తిపన్నులో పెంపు, గత 14 సంవత్సరాల నుండి లేక తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయాయి. ఇందుకోసం పెంపు 10% నుండి 30% వరకు ఉండవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే పెంపు ప్రతిపాదనలు సిఎం కార్యాలయం చేరుకున్నా, ఎన్నికల మూలాన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా ప్రతిపాదనలు వాయిదా వేశారు.

APSRTC గత నవంబర్లో బస్సు ఛార్జీలు పెంచింది, కానీ TSRTC అప్పుడు పెంచకపోయినా ఇంకో రెండు నెలలలోపు, 10% చార్జీలు పెంచబోతున్నట్లుగా సమాచారం. ఎంబిబిఎస్, బీడీఎస్, బీటెక్, ఎంబీఏ తదీతర వృత్తి విద్య కోర్సుల ఫీజుల పెంపు కూడా భారీగానే ఉంటుందని తెలుస్తోంది. ఇక రెవెన్యూ శాఖ, జూలై 2014 నుండి భూమి విలువ పెంచవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంది. ఆ పెంపు కూడా ఈ ఆగస్టు లోనే ఉండవచ్చని ఉన్నత వర్గాల సమాచారం.