యాపిల్ సంస్థ తమ యాపిల్ మ్యాప్స్ కేంద్రాన్ని, ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్‌లోని వేవ్‌రాక్ భవనంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొని, ఐటీకి సంబంధించిన పలు అంశాలపై టిమ్‌కుక్‌తో చర్చించారు. టీఎస్ ఐపాస్, ఐటీ విధాన ప్రతులను టిమ్‌కుక్‌కు తెలంగాణ ప్రభుత్వం అందించింది.
ఈ సందర్భంగా టిమ్‌కుక్ మాట్లాడుతూ, "హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర యువత నైపుణ్య సామర్థ్యాలు, కంపనీకి ఉపయోగపడుతాయన్నారు.
అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ, యాపిల్ తమ కొత్త కేంద్రానికి హైదరాబాద్ ను సెలెక్ట్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. యాపిల్ ద్వారా యువతకు ఎన్నో ఉపాధి అవకాహ్సాలు లభిస్తాయని సిఎం అభిప్రాయపడ్డారు.
ఆపిల్ ద్వారా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం టాప్-5లో ఉన్న మూడు ఐటీ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. టీ-హబ్‌తో కలిసి పని చేయడానికి యాపిల్ సిద్ధంగా ఉందని కెటీఆర్ తెలిపారు.