మాలాంటి పేద వాళ్ళ పై కెసిఆర్ దౌర్జన్యం చేస్తున్నారు- జగన్

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారం చేతిలో ఉంది కదా అని తమలాంటి పేద వాళ్ళతో ఆడుకోవడం సరికాదని జగన్ అన్నారు. మహబూబ్ నగర్ నీళ్ళు తెలంగాణ లోని ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తే, శ్రీశైలం తో పాటు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకు అన్యాయం జరగడం తప్పదని, అదే జరిగితే, దాన్ని అడ్డుకోవడానికి తాను ఏం చేయడానికైన సిద్ధమని జగన్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, దాని పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మెదపకుండా ఉందని చెబుతూ, మూడు రోజుల క్రితం దీక్షకు దిగిన జగన్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద విమర్శలు గుప్పిస్తుండడం తెలిసిందే.

అయితే దీక్ష విరమించిన తరువాత, మీడియా ముందు జగన్ మాట్లాడుతూ మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కలిపితేనే ఈ నీటి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం నీటి సమస్యను ఎలా పరిష్కరించిందో జగన్ గుర్తు చేశారు.