తాగునీటికి ఇబ్బంది పడుతున్న ఎన్నో కింది రాష్ట్రాలను చూస్తూ కూడా కెసిఆర్ ఇలా ప్రాజెక్టులు కడుతుంటే జనాల ఉసురు తగలదా అని ఎపి విపక్ష నేత జగన్ అన్నారు.
మహారాష్ట్ర,కర్నాటక అక్రమ ప్రాజెక్టులకు వ్యతి రేకంగా తెలుగువారంతా పోరాడవలసిన సమయంలో ఇలా, ఎగువ రాష్ట్రంగా అక్రమ ప్రాజెక్టులు కట్టడం దారుణం అని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే హైదరాబాద్ ను లాక్కుని ఏపీ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా అన్యాయం చేసిన కెసిఆర్, ఇప్పుడు నీటిని కూడా లాక్కుంటే ఎలా అని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇండియా పాకిస్తాన్ యుద్ధం మాదిరిగా తయారవుతుందని, కాబట్టి ఇలా అడ్డగోలుగా వ్యవహరించడం మానుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను బహిరంగంగా జగన్ హెచ్చరించారు.
కెసిఆర్ తన ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లని లెక్కగట్టుకొని తీసుకొని, మిగిలింది మీ నీరు అని చెబుతున్నారని జగన్ అన్నారు. గోదావరి పై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమంగా కడుతున్నవే అని జగన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ మీదుగా నదులు వస్తున్న తరుణంలో కెసిఆర్ ఇలా హిట్లర్ మాదిరి వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని జగన్ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వైరం ఇండియా పాకిస్తాన్ మాదిరిగా తయారవకముందే, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటి అవ్వాలని జగన్ అన్నారు.
మరోవైపు జగన్ మాటలు విన్న విశ్లేషకులు, కెసిఆర్ ఒకరు ఉన్నారని సడన్ గా గుర్తొచ్చి చిన్న కామెంట్ చేసి, మళ్ళీ ఆరు నెలల దాకా కనిపించని జగన్ మాటలు వినే జనాలు లేరు, ఒకవేళ విన్నా అవి నమ్మే జనాలు మాత్రం అసలే లేరు అని అభిప్రాయపడుతున్నారు.