రేవంత్ రెడ్డి లోని ఆ ఫైర్ ఎక్కడ?

టిడిపి పక్ష నేత రేవంత్ రెడ్డి కి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వైరం గురించి  కొత్తగా తెలుసుకోవాల్సిన పని లేదు. కాని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కొత్తగా ఏదో తెల్సుకోవాల్సిన అవసరం వచ్చిందనిపిస్తుంది.
కొడంగల్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తో కలిసి రేవంత్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పుడు  చర్చనీయాంశమయింది. రేవంత్ రెడ్డి నియోజకవర్గం అయిన కొడంగల్ లోని కొన్ని గ్రామాలలో వీరిద్దరూ కలిసి అభివృద్ధి కార్యకరమాల్లొ పాల్గొనడం హర్షదాయకం. ఆరోగ్య శాఖ మంత్రి ని రేవంత్ రెడ్డి కొన్ని పనులను చేయమని కోరగా, మంత్రి దానికి సుముఖత చూపినట్లు సమాచారం.   
తెలంగాణాలో టిడిపి దాదాపుగా దుకాణం మూసేసే పనిలో ఉన్న సమయంలో, చంద్రబాబు కూడా రేవంత్ పై పెద్దగా దృష్టి సారించకపోవడంతో, తన రాజకీయ భవిష్యత్తు కోసం, గతంలో లాగా తెలంగాణ  ప్రభుత్వం యుద్ధం మానేసి సంధికి రావడమే రేవంత్ రెడ్డి ఆంతర్యం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే లోని ఫైర్ అంత చల్లారిబోయి ఇలా నిదానంగా మాట్లాడడం తన రాజకీయ భవిస్యత్తుకి ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి