
కల్వకుంట్ల కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు ప్రకటించారు. ఈ ఎన్నికల సమన్వయకర్తగా పార్టీ రాష్ట్ర స్థాయి పరిశీలకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను నియమించారు.
ఒక ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించినందున, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి కూడా త్వరలో అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజేపి మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి కనుక వాటి మద్య ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య భీకరపోరు జరుగుతుంది. కనుక వాటితో టీఆర్ఎస్ పార్టీ పోటీపడి విజయం సాధించడం అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ ఒకవేళ ఒక్క సీటు గెలుచుకున్నా, టీఆర్ఎస్ పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు కల్వకుంట్ల కవిత చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే భావించవచ్చు.