పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రాకేశ్ రెడ్డి పేరు ఖరారు?

త్వరలో జరుగబోతున్న ఖమ్మం-వరంగల్-నల్గొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించింది.

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సామ రామ్మోహన్‌ రెడ్డి పేరు ఖరారు చేయగా, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించింది. కనుక బీఆర్ఎస్‌ పార్టీ కూడా ఈ రెండు స్థానాలకు అభ్యర్ధులను పరిశీలిస్తోంది. 

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి బీసీ అభ్యర్ధిని బరిలో దింపాలని భావిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, నాగేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకవేళ బీసీ అభ్యర్ధి వద్దనుకుంటే స్పోర్ట్స్ అధారిటీ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, మరికొందరు పోటీకి సిద్ధంగా ఉన్నారు. 

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. నేడో రేపో రెండు స్థానాలకు బీఆర్ఎస్‌ అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటించబోతోంది.