ఎన్నికలకు గుడ్‌బై.. మాజీ సిఎం సిద్ధ రామయ్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు కీలక ప్రకటన చేశారు. 2028లో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలతో సహాయ ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు. 

రాజకీయ రంగం పూర్తిగా కలుషితమైందని, ఇలాంటి పరిస్థితులలో రాజకీయాలలో కొనసాగలేనని అందుకే తప్పుకుంటున్నట్లు చెప్పారు. తన వయసు, ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.  

ప్రజల కోసం తన వంతు బాధ్యతను నిర్వర్తించాననే తృప్తితో రాజకీయాలను వీడుతున్నప్పటికీ ప్రజా జీవితానికి మాత్రం దూరం కాబోనని ఆయన గతంలోనే స్పష్టం చేశారు.

సిద్ధరామయ్య ఈవిధంగా హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవడం అభినందనీయమే. దేశంలోనమి ఈ వయసు  రాజకీయ నాయకులందరూ ఆయనని స్పూర్తిగా తీసుకొని గౌరవంగా తప్పుకొని కొత్త తరానికి దారి ఇస్తే బాగుంటుంది.