మోడీ వారిని కలవడంతోనే ఈ ఆందోళన

తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “గత నెల ప్రధాని మోడీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఇళ్ళకు వెళ్ళి భేటీ అయినప్పటి నుంచే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. అందుకే కాంగ్రెస్‌ పవన్ కళ్యాణ్‌ పార్టీ సమావేశానికి అనుమతివ్వలేదు. ఆయన సమావేశం పెట్టుకుంటే ఏమవుతుంది? అదే ఆయన అడిగారు. 

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజల ఆకాంక్షలు తీర్చలేకపోయాయి. ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోయాయి. కనుక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నాయి. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాకారులపై కర్రలు, రాళ్ళతో దాడులు చేయించినవారిని కేసీఆర్‌ తెచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. చివరికి తెలంగాణని తీవ్రంగా వ్యతిరేకించిన మజ్లీస్ పార్టీతో దోస్తీ చేశారు. కానీ పవన్ కళ్యాణ్‌ వస్తే కుదరదంటున్నారు. దేనికి? అంటూ రాంచందర్ రావు ప్రశ్నించారు.

 (Video source: Telugu 360)