మీరెందుకు భుజాలు తడుముకుంటారు కేటీఆర్‌? జనసేన ప్రశ్న

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ మొన్న హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఆయనకు జనసేన తెలంగాణ కూడా అంతే ఘాటుగా సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇచ్చింది.

“వాళ్ళు జనగణమన పాడటానికి ఇష్టపడరని’ పవన్ కళ్యాణ్‌ అన్న మాటలను మీకు  మీరెందుకు ఆపాదించుకుంటారు?

తెలంగాణలోకి రానియ్యం అడుగుపెట్టనీయం, సమావేశం, ప్రెస్‌మీట్‌ పెట్టనీయమన్న వాళ్ళని ఉద్దేశ్యించి పవన్ కళ్యాణ్‌ మాట్లాడితే వాటిని మీరెందుకు ఆపాదించుకుంటున్నారు?

మీ పార్టీని ఇతర రాష్ట్రాలలో విస్తరించుకోవచ్చు. కానీ ఇతరులు తెలంగాణలో అడుగుపెట్టాలంటే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా? పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారే తప్ప ప్రాంతీయ విద్వేషాలు సృష్టించలేదు... అంటూ పెద్ద పోస్ట్ పెట్టింది. జనసేన తెలంగాణ ఏమన్నదో దాని మాటల్లోనే...