గద్దర్‌ కుమార్తె కూడా ఖండించారు పవన్ వ్యాఖ్యలని

తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, టీజేఎస్ తదితర పార్టీల నేతలతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ తన ప్రసంగంలో ప్రజాగాయకుడు గద్దర్‌ తన అనుబందం నెమరువేసుకున్నారు. కానీ ఆయన కుమార్తె వెన్నెల పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలను, ఆయన తీరుని ఖండిస్తూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 

“తెలంగాణ సినిమాల వల్ల వచ్చింది కాదు. అలాగే  డబ్బులు పంచితే లేదా లాబీయింగ్ చేసి సాధించుకోలేదు. నాలుగు కోట్ల మంది ప్రజలు అనేక ఏళ్ళ పాటు పోరాటాలు చేసి సాధించుకున్నారు. అనేక మంది బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నాము. అలా సాధించుకున్న తెలంగాణ పట్ల మీ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను,” అంటూ ఆమె పవన్ కళ్యాణ్‌ తీరుని తప్పు పట్టారు. 

ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే.... 

(Video Courtesy: Telugu Scribe)