రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ జారీ

దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న24 రాజ్యసభ సీట్ల భర్తీకి కేంద్ర ఎన్నికల కమీషన్‌ నేడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జూన్‌ 18న ఎన్నికలు నిర్వహించబోతోంది. 

వీటికి జూన్‌ 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆరోజు నుంచి జూన్‌ 8 వరకు నామినేషన్స్ దాఖలు చేయవచ్చు. నామినేషన్స్ పరిశీలన- జూన్‌ 9న, నామినేషన్స్ ఉపసంహరణ గడువు- 11 వరకు, పోలింగ్- జూన్‌ 18న జరుగుతుంది. 

పోలింగ్ ముగియగానే అదే రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. జూన్‌ 20వ తేదీతో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు లేవు. కానీ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 4 సీట్లకు ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. కనుక ఎమ్మెల్యేల బలం ఉన్న టీడీపి, జనసేన, బిజేపిలే నాలుగు సీట్లు పంచుకుంటాయి.