ప్రధాని మోడీ మాట తప్పారు: సిఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోడీ మాట తప్పారని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచబోమని పదేపదే చెప్పారు. కానీ ఎన్నికలు కాగానే ధరలు పెంచేశారు. అంతేకాదు.. పశ్చిమాసియా యుద్ధం పేరుతో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచడం ప్రజలను మోసగించారు. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు నిర్ణయం సరికాదు. దీని వలన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై మరింత భారం పడుతుంది,” అంటూ ఓ పెద్ద లేఖని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ పాలన, నిర్ణయాల గురించి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే...