ఉదయం 11 గంటలకు తమిళనాడు, బెంగాల్ ఓటింగ్ శాతం

ఈరోజు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉన్నందున తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కనుక రెండు రాష్ట్రాలలో భారీగానే ఓటింగ్ శాతం నమోదైంది. 

తమిళనాడులో ఉదయం 11 గంటలకు 37.56 శాతం నమోదు కాగా, అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ-బిజేపి మద్య హోరాహోరీగా ఎన్నికల యుద్ధం సాగినందున 41.11 శాతం పోలింగ్ నమోదైంది. 

తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్లో నేడు 152 స్థానాలకు మళ్ళీ ఏప్రిల్‌ 29న మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరుగబోతోంది. 

మే 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.