.jpg)
కోర్ట్ జంటగా పేరు సంపాదించుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం గత నెల థియేటర్లలో విడుదలై పరవాలేదనిపించుకుంది. ఇప్పుడీ సినిమా ఈ నెల 24 నుంచి జీ5 ఓటీటీలోకి వచ్చేస్తోంది. కనుక థియేటర్లలో బ్యాండ్ మేళం వినలేకపోయిన వారు ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని వినొచ్చు. చూడొచ్చు.
ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు సతీష్ జువ్వాది దర్శకత్వం చేశారు. క్లుప్తంగా కథ:
యాదగిరి అలియాస్ గిరి (హర్ష్ రోషన్) రాజీ (శ్రీదేవి) బావామరదళ్ళు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. కనుక పెద్దలు వారిద్దరికీ పెళ్ళి చేయాలనుకుంటారు. కానీ రాజీ చదువులలో టాపర్ ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటుంది.
కానీ యాదగిరి ఊళ్ళో స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ (బ్యాండ్ మేళం) పెడతాడు. ఇద్దరి మద్య ఈ అంతరం ఉండటంతో ఆమె తండ్రి సాయన్న (సాయి కుమార్) ఆమెకు తగిన సంబంధం చూసి పెళ్ళి చేయాలనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.