
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా చేస్తున్న ‘స్వయంభూ’ నుంచి ‘రారా ధీవర...’ అంటూ సాగే పవర్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకు రవి బస్రూర్ సంగీతం అందించగా సంతోష్ వెంకీ బృందం ఆలపించింది.
ఈ సినిమాలో నిఖిల్‌కి హీరోయిన్లుగా నభా నటేష్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: కెకె సెంథిల్ కుమార్, డైలాగ్స్: విజయ్ కామిశెట్టి, స్టంట్స్: కింగ్ సోలమన్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న స్వయంభూ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారాణాల వలన ఈ వేసవిలో విడుదలవుతోంది.