మరికొద్ది సేపట్లో కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం?

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భర్త దేవనపల్లి అనిల్‌తో కలిసి నిజామాబాద్‌లోని శ్రీరఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. 

ఈరోజు ఉదయం 8 గంటలకు ఆమె సిద్ధిపేటలో తన కొత్త పార్టీని ప్రకటించి, జెండా, అజెండా విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ముందుగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. మరికొద్ది సేపటిలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.