
దేశ వ్యాప్తంగా 37 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగుస్తుంది. వారిలో తెలంగాణకు చెందిన డా.అభిషేక్ మను సింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి కూడా ఉన్నారు.
రాజ్యసభ సభ్యులని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కనుక వారిని గెలిపించుకోగల బలం ఉన్న పార్టీలే అభ్యర్ధులను బరిలో దింపుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సరిపడ ఎమ్మెల్యేలున్నారు. కనుక ఈ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోబోతోంది.
ఎన్నికల షెడ్యూల్:
ఎన్నికల నోటిఫికేషన్: ఫిభ్రవరి 26,
నామినేషన్స్ గడువు: మార్చి 5,
నామినేషన్స్ పరిశీలన: మార్చి 6,
నామినేషన్స్ ఉప సంహరణ: మార్చి 9,
పోలింగ్: మార్చి 16 ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు.
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మార్చి 16 సాయంత్రం 5.00 గంటల నుంచి ముగిసే వరకు వరకు.
ఈ ఎన్నికల ప్రక్రియ ముగింపు: మార్చి 20.