రంజాన్: తెలంగాణ ప్రభుత్వం జీవో

ఫిభ్రవరి 19 నుంచి రంజాన్ మాసం మొదలవుతుంది. మార్చి  20 వరకు నెల రోజులపాటు సాగే రంజాన్ పండుగలో ముస్లింలందరూ ఉపవాసాలు, ప్రార్ధనలు చేస్తారు. కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులలో ముస్లింలకు రంజాన్ ప్రార్ధనలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గురువారం నుంచి మార్చి 19 వరకు నెల రోజులపాటు ప్రతీరోజూ సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తే చాలని జీవోలో పేర్కొంది. రంజాన్ ప్రార్ధనల కోసం అనుమతి మంజూరు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. అయితే అత్యవసరమైతే వారు యధావిధిగా పనిచేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొంది.