కర్ణాటక డిజీపి రాసలీలలు... ఉద్యోగంలో నుంచి సస్పెండ్!

కర్ణాటక డిజీపి కె రామచంద్ర రావు రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రభుత్వం ఆయనని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తన కార్యాలయంలోనే మహిళలతో రాసలీలలు సాగిస్తున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఆ వీడియోలలో ఆయన ముగ్గురు మహిళలతో రాసలీలలు సాగిస్తూ కనిపించారు. వీడియోలలో మహిళల మొహాలు బ్లర్ చేసి ఆయన మాత్రం స్పష్టంగా కనిపించేలా ఎవరో వీడియో తీశారు. వాటిని ఆయన ఖండించారు. వాటితో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, ఎవరో తనపై కక్షతో మార్ఫింగ్ ద్వారా వీడియోలు సృష్టించారని అన్నారు.

కానీ ఇవి అసలు వీడియోలేనా కాదా? అని దర్యాప్తు జరిపి తెలుసుకునే వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగుతుం, అంతవరకు హెడ్ క్వార్టర్స్ విడిచి బయటకు వెళ్ళరాదని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. 

కర్ణాటకలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు శాసనసభలోనే మొబైల్ ఫోన్లలో బ్లూ ఫిలిమ్స్ చూస్తున్న వీడియోలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. ఈసారి ఏకంగా పోలీస్ బాస్ డీజీపీ రామచంద్ర రావు వీడియో రాసలీలల వీడియో బయటకు వచ్చేసింది.