సంబంధిత వార్తలు

మహిళా ఐఏఎస్ అధికారి గురించి అనుచిత కధనం ప్రసారం చేసినందుకు పోలీసులు ఎన్టీవీ న్యూస్ ఛానల్‌కు చెందిన జర్నలిస్టులు దొంతు రమేష్, దాసరి సుధీర్‌లని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా న్యాయస్థానం వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరూ తమ పాస్‌పోర్టులు పోలీసులకు అప్పగించాలని, వారి అనుమతి తీసుకోకుండా నగరం విడిచి బయటకు వెళ్ళరాదని షరతులు విధించింది. ఇద్దరూ చెరో రూ.20 వేలు చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఆ షరతులకు వారు అంగీకరించడంతో నాంపల్లి కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.