తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు?

ఎన్‌టీవీ రిపోర్టర్లను అరెస్ట్ చేయడంపై ఆ న్యూస్ ఛానల్, బీఆర్ఎస్‌ పార్టీ నేతల విమర్శలపై హైదరాబాద్‌ సీపీ విసి సజ్జనార్‌ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఓ మహిళా అధికారిపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడం చాలా తప్పు? 

 తప్పు కాదని భావిస్తున్నట్లయితే రిపోర్టర్లు ఫోన్‌లు స్విచాఫ్ చేసుకున్నారు? రహస్యంగా ఎందుకు బ్యాంకాక్ పారిపోతున్నారు? వచ్చి విచారణకు సహకరించాలి కదా?సహకరించి ఉంటే వారిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు కదా? ఇంత జరుగుతున్నా ఆ న్యూస్ ఛానల్ ఎండీ, సీఈవో పత్తా లేరు. ఎందువల్ల? ఈ కేసులో నిందితులు ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవు. ముఖ్యమంత్రిని అవమానిస్తూ వార్తలు ప్రసారం చేసినందుకు మరో కేసు నమోదు చేశాము. ఈ రెండు కేసులు సిట్ విచారణ జరుపుతుంది,” అని విసి సజ్జనార్‌ అన్నారు.