బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఓ సమావేశంలో మాట్లాడుతూ, “ఈ రేవంత్ రెడ్డి రోజూ అరుస్తున్నాడు. ఆయన భార్య గీతమ్మకి ఓ మాట చెపుతున్నా. తల్లీ నీ భర్తని కాస్త కంట్రోల్ చెయ్యి. లేకుంటే ఆయన రోజూ ఇలాగే ఎవరో ఒకరిపై అరుస్తూనే ఉంటాడు. అరిచీ అరిచీ పిచ్చి ముదిరి అందరినీ కరిచేలా ఉన్నాడు.
ఆయన అరుపులకు ఇక్కడ ఎవరూ భయపడేవాళ్ళు లేరు. ఏనుగు దారిన పోతుంటే కుక్కలు, నక్కలు అరుస్తూనే ఉంటాయి. కానీ అది వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉంటుంది. మేము అలాగే సాగుతున్నాము,” అని అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి సతీమణి ఏనాడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. కనీసం ఎన్నడూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందీ లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తవన కేటీఆర్ చేయడం సబబు కానే కాదు.
ఇదివరకు ఏపీలో వైసీపీ నేతలు కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణమే.
కేటీఆర్ మర్యాదపూర్వకంగానే చెప్పి ఉండవచ్చు కానీ రాజకీయాలకు దూరంగా ఉండే కుటుంబ సభ్యుల గురించి, ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది.

ఎందుకు KTR అన్న

రేవంత్ అన్న భార్య గీత వదినమ్మ పేరు తీయడం

మళ్లీ శైలిమ వదినమ్మ పేరు పై కౌంటర్ అవతలి సైడ్ వాళ్లు ఇస్తే తీసుకోగలవా అన్న..

ఎందుకు అన్న ఇవన్నీ

ఒక సూత్రం ఉంటది KTR అన్న మన టైమ్ బాలేనప్పుడు మన నాలుకలో అదుపులో పెట్టుకోవాలి అదే తెలివైన వాడి లక్షణము pic.twitter.com/MO4ELTsJxw
— AshaPriya Mudiraj 🇮🇳 (@ashapriya09) December 26, 2025