మూడో విడత పంచాయితీలో కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యం

తెలంగాణలో నేడు మూడవ మరియు తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొద్ది సేపటి క్రితమే ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 4,159 సర్పంచ్‌ పదవులకు గాను మధ్యాహ్నం 3 గంటలకు 395 ఫలితాలు ప్రకటించారు.

వాటిలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 287, బీఆర్ఎస్‌ పార్టీ 42, బీజేపి 9, ఇతరులు 57 స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పటి వరకు వెలువడిన వాటిలో కాంగ్రెస్‌ పార్టీకి అత్యధికంగా నల్గొండ (34) గెలుచుకోగా ములుగు, కుమురుం భీం, హనుమకొండలో ఒక్క సీటు కూడా రాలేదు.

బీఆర్ఎస్‌ పార్టీకి అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 11 సీట్లు గెలుచుకోగా 12 జిల్లాలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.

బీజేపి ఎప్పటిలాగే 9 సీట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా స్వతంత్ర అభ్యర్ధులు 57 మంది మూడో స్థానంలో నిలిచారు. 

తొలిదశ ఫలితాలు: కాంగ్రెస్‌ 2331, బీఆర్ఎస్‌: 1168, బీజేపి: 189, ఇతరులు 539 సర్పంచ్‌ పదవులు గెలుచుకున్నారు.

రెండో దశ ఫలితాలు: కాంగ్రెస్‌ 2245, బీఆర్ఎస్‌: 1,188, బీజేపి: 268, ఇతరులు 624 సర్పంచ్‌ పదవులు గెలుచుకున్నారు.