గవర్నర్ అనుమతి కక్ష సాధింపే! వేముల

ఎఫ్‌-1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంపై బీఆర్ఎస్‌ నేతలు స్పందించడం మొదలుపెట్టారు.

ముందుగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ, “రెండేళ్ళగా ఎఫ్‌-1 రేసింగ్ కేసులో విచారణ పేరుతో కొండను తవ్వినా ఎలుకను పట్టలేకపోయారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించి ఆ ఎన్నికలలో ఒడ్డున పడేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపితో కలిసి ఈ కక్షపూరిత రాజకీయాలకు తెర లేపింది.

కాంగ్రెస్‌, బీజేపిలు కుమ్మక్కయ్యాయని మేము మొదటి నుంచి చెపుతూనే ఉన్నాము. ఇప్పుడు అదే రుజువైంది. కానీ ఈ రాజకీయ కక్షలకు, కేసులకు మేము భయపడబోము. బీఆర్ఎస్‌ పార్టీలో మేమందరం కేటీఆర్‌కు అండగా నిలబడతాము.

ఎఫ్‌-1 రేసింగ్ వలన హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది తప్ప ఎటువంటి అవినీతి జరుగలేదు. కనుక ఈ కేసుపై మేము న్యాయస్థానంలో పోరాడుతాము. మాకు న్యాయ వ్యవస్థలపై నమ్మకముంది,” అని అన్నారు వేముల! 

ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పెద్ద పోస్ట్ పెట్టారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే....